TG: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల! 5 d ago
ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 5వ తేదీ నుండి, ఆ మరుసటి రోజు 6వ తేదీన రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి 22 వరకు జరుగుతాయి. మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్దులకు ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మార్చి 19వ తేదీకి అలాగే ద్వితీయ సంవత్సరం వారికి మార్చి 20 వ తేదీకి పూర్తవుతాయి. అన్ని పరీక్షలు మార్చి 25 వ తేదీతో ముగుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరాలకు కలిపి మొత్తం సుమారు 9 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు.